అక్షరటుడే, ఇందూరు: నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి ఓ కారు రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాలపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.