అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: ఎన్ హెచ్-44పై భిక్కనూరు మండలం అంతంపల్లి టోల్ గేట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టోల్ గేట్ వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కంటైనర్ డ్రైవర్ సిరాజుద్దీన్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఘటనా స్థలానికి పోలీసు సిబ్బంది చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.