అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: అర్థరాత్రి వరకు హోటళ్లు, బేకరీలు తెరిచిన ముగ్గురికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధించారు. 1వ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. వన్‌టౌన్ పరిధిలోని నెహ్రూపార్క్ వద్ద అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచిన ఒలింపియా బేకరి షేక్ అమాన్‌ను, రైల్వేస్టేషన్ ప్రాంతంలోని స్టార్ హోటల్ షేక్ అస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే న్యూ ప్యారడైజ్ హోటల్ వర్కర్ అత్నూర్‌ను అదుపులోకి తీసుకుని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపర్చగా అస్లాం, అత్నూర్‌కు ఒకరోజు జైలుశిక్ష విధించారు. షేక్ అమాన్‌కు రెండురోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.