అక్షరటుడే, బోధన్‌: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జరిమానాగా సమాజసేవ చేయాలని బోధన్‌ సెకండ్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ తీర్పునిచ్చారు. బోధన్‌ టౌన్‌ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. జనావాసాల మధ్య మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను బోధన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా ఒకరోజు సమాజసేవ చేయాలని తీర్పునిచ్చారు. అలాగే ఇవ్‌టీజింగ్‌ చేస్తున్న ఇద్దరు ఆకతాయిలకు రెండురోజుల జైలు శిక్ష విధించారు.