అక్షరటుడే, వెబ్‌డెస్క్: బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి టాస్క్‌ఫోర్స్ పోలీసునని చెప్పి సెంటర్లోకి మూడు సార్లు వెళ్లి వచ్చాడు. అయినా ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. ఐసీసీసీకి ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్‌లో కూకట్ పల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ జ్ఞానసాయి ప్రసాద్ అనే వ్యక్తిని కలిసి, తాను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ హరిజన గోవర్ధన్ అని పరిచయం చేసుకున్నాడు. హోటల్ వ్యాపారంలో లాభాలు ఉంటాయని చెప్పి జ్ఞానసాయి ప్రసాద్ దగ్గర రూ.2.82 లక్షలు వసూలు చేశాడు. నిందితుడు ఐసీసీసీ నుంచి బయటకు రావడంతో అతను నిజంగానే టాస్క్ ఫోర్స్ అధికారి అని జ్ఞానసాయి ప్రసాద్ నమ్మి మోసపోయాడు. నిజం తెలిశాక బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.