అక్షరటుడే, వెబ్‌డెస్క్: సూసైడ్ చేసుకుంటున్నానని ఓ వ్యక్తి చేసిన సెల్ఫీవీడియో ఆంధ్ర ప్రదేశ్ లో కలకలం రేపుతోంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్నానని, పేరుపాలెం బీచ్‌లో చనిపోతున్నానంటూ సతీష్ అనే వ్యక్తి వీడియో రికార్డు చేశాడు. సదరు సెల్ఫీ వీడియోను బంధువులకు పంపించాడు. సతీష్ స్వస్థలం కొవ్వూరు మండలం బంగారుపేట. ప్రస్తుతం మొగల్తూరు పోలీసులు పేరుపాలెం బీచ్‌లో సతీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.