అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : మాదకద్రవ్యాల వినియోగం కారణంగా ఏర్పడే దుష్పరిణామాల గురించి జిల్లా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నాగారంలోని మైనారిటీస్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ సోమనాథం ఆధ్వర్యంలో అధికారులు పూర్ణేశ్వర్, నర్సింలు కలిసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాలలో డ్రగ్స్ వాడకుండా విద్యార్థులకు సదస్సులు నిర్వహించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. కార్యక్రమంలో డ్రగ్స్ఫ్రీ తెలంగాణ పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థులు స్వచ్ఛందంగా యాంటీ డ్రగ్స్ సోల్జర్లుగా మారి అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు.