అక్షరటుడే, ఆర్మూర్​: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంభమేళాకు వెళ్లి వస్తున్న వాహనం డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. వివరాల్లోకి వెళ్తే.. నాగ్​పూర్​ వైపు నుంచి హైదరాబాద్​ వైపు వెళ్తున్న తుపాన్​ వాహనం శనివారం తెల్లవారు జామున మెండోరా మండలం బుస్సాపూర్​ వద్ద డివైడర్​ను ఢీకొట్టింది. దీంతో వాహనం కొద్దిదూరం దూసుకెళ్లి రోడ్డుపక్కన బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్​ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా.. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రయాణికులంతా భువనగిరికి చెందిన వారిగా సమాచారం.