అక్షరటుడే, వెబ్‌డెస్క్: వరంగల్ హైవేపై ఘట్కేసర్ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో యాదగిరి గుట్టకు వెళ్లి వస్తున్న డీసీఎం బ్రేకులు ఫెయిలై పల్టీ కొట్టింది. ఈ ఘటనలో 35 మందికి గాయాలయ్యాయి. యాత్రికులు మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉప్పునూతల గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఘట్కేసర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.