అక్షరటుడే, వెబ్డెస్క్: గుజరాత్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొంది. ఈ ఘటన కచ్ జిల్లాలోని కీరా ముంద్రా రోడ్డులో జరిగింది. ప్రమాదంలో 9 మంది మరణించగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు.