అక్షరటుడే, హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఓ పబ్ లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ప్రిజం పబ్బులో పాత నేరస్తుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులను చూసిన నేరస్తుడు గన్‌తో కాల్పులకు పాల్పడ్డాడు. నిందితుడి కాల్పుల్లో వెంకట్‌రామ్‌రెడ్డి అనే కానిస్టేబుల్‌ కి గాయాలయ్యాయి.