అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఆడుకుంటున్న బాలికను పొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.