అక్షరటుడే, వెబ్​డెస్క్​: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు ప్రభుత్వానికే చెందుతాయని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. రూ.4 వేల కోట్ల విలువైన ఆస్తులను ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ప్రభుత్వానికి అప్పగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇందులో 1,562 ఎకరాల భూమి, 27 కిలోల బంగారు, వజ్ర ఆభరణాలు, 11 వేల పట్టుచీరలు, 750 జతల ఖరీదైన చెప్పులు ఉన్నాయి. దాదాపు పదేళ్ల క్రితం తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో వీటి విలువ రూ.913 కోట్లు కాగా.. మార్కెట్​ విలువ పెరిగి ప్రస్తుతం రూ.4వేల కోట్లకు చేరాయి.