అక్షరటుడే, ఇందల్వాయి: ఆగి ఉన్న వాహనాన్ని అతివేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ఘటన గురువారం ఉదయం ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి వద్ద చోటు చేసుకుంది. రోడ్డుపై వాహనాన్ని నిలిపి ఉన్న టోల్‌ప్లాజా సిబ్బంది పనులు చేస్తుండగా డీసీఎం ఢీకొంది. దీంతో వాహన డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాలు జాతీయ రహదారిపై ఇరుక్కుపోయాయి. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
