అక్షరటుడే, వెబ్డెస్క్: నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖపట్నం మధురవాడ పరదేశి పాలెంలో చోటు చేసుకుంది. సరిగా చదవడం లేదని అధ్యాపకుడు మందలించడంతో సెకండియర్ విద్యార్థి చంద్రవంశీ(17) కాలేజీపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.