అక్షరటుడే, వెబ్​డెస్క్: ఖమ్మంలోని ఇల్లందు క్రాస్​రోడ్డులో గల శ్రీ చైతన్య కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అల్లూరి జిల్లా ఎటపాకకు చెందిన యోగానందిని(17) కాలేజీలో ఫస్టియర్​ చదువుతోంది. ఆమె శుక్రవారం ఉదయం తరగతి గదిలో ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.