అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటుచేసుకుంది. ఐదో టౌన్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నాగారంలోని 80 క్వార్టర్స్ కు చెందిన మీసాల కృష్ణ(44) టీ షాపు నడుపుతుండేవాడు. మద్యం సేవిస్తూ తరచూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో భార్య ఇటీవల ఇంటి నుంచి తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఆమె తిరిగి రాకపోవడంతో.. మద్యానికి బానిసైన కృష్ణ శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.