అక్షరటుడే, ఆర్మూర్: మున్సిపాలిటీలో రోడ్లు శుభ్రపరిచే రూ.38 లక్షల విలువైన యంత్రం మూలకు చేరింది. 14వ ఆర్థిక సంఘం నిధులతో 2020లో స్వీపింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. మొదట్లో కొన్ని రోజులు నడిపించగా.. తర్వాత పిస మల్లన్న గుడి ప్రాంతంలో చెడిపోగా కొన్ని నెలలు అక్కడే రోడ్డుపై నిలిపేశారు. మెయింటెనెన్స్ పేరిట రూ.11 లక్షలు ఖర్చు చేశారు. అనంతరం దానిని తీసుకెళ్లి స్క్రాప్‌లో పడేశారు. నాసిరకం మిషన్ విషయంలో కంపెనీకి నోటీసులు గానీ, డబ్బుల రికవరీ చేసిన దాఖలాలు లేవు. దీంతో మున్సిపల్ అధికారుల తీరుపై ఆర్మూర్ పట్టణ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.