అక్షరటుడే, ఇందూరు: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ముగ్గురు సభ్యుల న్యాక్ బృందం పర్యటించింది. కళాశాల సౌకర్యాలు, ల్యాబ్, గార్డెనింగ్‌తో పాటు అన్ని విభాగాలను పరిశీలించారు. కళాశాలకు సంబంధించిన పలు ప్రశ్నలను అడిగారు. బృందం సభ్యులకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల పతకాలు, సేవా కార్యక్రమాలను అధ్యాపకులు వివరించారు. న్యాక్ బృందంలో రాకేష్ కుమార్ గుప్తా, హరిశ్చంద్ర, అనిరుద్ భార్గవ్ ఉన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.