అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: గ్వాటెమాల దేశంలో విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 20 అడుగల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులోని 51 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. అధికారుల వివరాల ప్రకారం.. సోమవారం ప్యూంటె బెలిస్ వంతెనపై నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లడంతో అందులోని 51 మంది ప్రయాణికులు జల సమాధి అయ్యారు.

ఈ దుర్ఘటనపై గ్వాటెమాల అధ్యక్షుడు బెర్నార్డో అరెవాలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘీభావంగా మూడు రోజుల పాటు జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. ఘటనా స్థలంలో సైన్యం, గ్యాటెమాల రెస్కూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.