అక్షరటుడే, వెబ్ డెస్క్: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. వేలూరు జిల్లాలో చిరుత దాడిలో యువతి మృతి చెందింది. వంట చేయడానికి కట్టెల కోసం అంజలి అనే యువతి అడవిలోకి వెళ్ళింది. తిరిగి వస్తుండగా ఆమెపై చిరుత దాడి చేసింది. అంజలి ఎంతకీ తిరిగి రాకపోవడంతో గ్రామస్థులు అడవిలో గాలించారు. 30 కిలోమీటర్ల దూరంలో యువతి మృతదేహం లభించింది. ఘటన స్థలాన్ని కలెక్టర్, అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. మెల్ మోలీ గ్రామ పంచాయతీలో అంజలి కుటుంబం నివాసం ఉంటోంది. ఈ ఘటనతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు.