అక్షరటుడే, వెబ్​డెస్క్​: అమెరికాకు చెందిన సైనిక విమానం అమృత్ సర్​కు చేరుకుంది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 205 మంది భారతీయుల్ని ఈ విమానం ఇండియాకు తీసుకొచ్చింది. అక్రమ వలసదారుల్ని అమెరికా దౌత్య సిబ్బంది.. భారత అధికారులకు అప్పగించనున్నారు. కాగా.. అమెరికాలో 7.5 లక్షల మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.