అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లిలో మంగళవారం పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పశువైద్యులు రవికిరణ్ సంజయ్ కుమార్ పశువులకు చికిత్స అందించారు. పాడి రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పశు వైద్యులు రమేష్, అనిల్ రెడ్డి, సూపర్‌వైజర్ కృష్ణ, పాల కేంద్రం అధ్యక్షుడు సాయిలు, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.