అక్షరటుడే, ఇందూరు: వైద్యం కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చిన ఓ బాధితురాలిని సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు పట్టించుకోలేదు. రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన కేతావత్ బిద్యా నాయక్ తన భార్యకు పలుసార్లు ఫిట్స్ రావడంతో శుక్రవారం జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అయితే ఆ మహిళ చికిత్సకు సహకరించకపోవడంతో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైద్యం అందించకుండానే వదిలేశారు. అనంతరం స్కానింగ్‌కు రిఫర్ చేశారు. కానీ అందుబాటులో లేదని ప్రైవేటులో తీయించాలని సూచించినట్లు బిద్యానాయక్ తెలిపారు. సమాచారం అందుకున్న అర్బన్ ఎమ్మెల్యే పీఏ గణపతి, బీజేపీ నాయకులు ఆసుపత్రికి చేరుకొని ప్రశ్నించడంతో వైద్యం అందించారు.