అక్షరటుడే, బోధన్: బోధన్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరి మహిళపై అత్యాచారయత్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సంగెం గ్రామానికి చెందిన మహిళ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో వరుసకు మరిది అయ్యే వ్యక్తి సోమవారం ఆమెపై అత్యాయత్నానికి ప్రయత్నించాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు తెలిపారు.