అక్షరటుడే, వెబ్​డెస్క్​: భర్త కిడ్నీ అమ్మి ఆ డబ్బులు తీసుకొని ప్రియుడితో పారిపోయింది ఓ మహిళ. ఈ ఘటన వెస్ట్ బెంగాల్​లోని హౌరా జిల్లాలో చోటు చేసుకుంది. తమ పదేళ్ల కూతురు భవిష్యత్ కు ​ డబ్బు కావాలని సదరు మహిళ భర్తకు చెప్పింది. ఒక కిడ్నీ అమ్మినా ఇంకో దానితో బతకొచ్చని మభ్యపెట్టింది. దీంతో ఆయన తన కిడ్నీని రూ.పది లక్షలకు అమ్మి ఆ డబ్బును భార్య చేతిలో పెట్టాడు. సోషల్​ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డ ఆమె ఆ డబ్బు తీసుకొని అతనితో పారిపోయింది. విషయం తెలిసిన భర్త పోలీసులను ఆశ్రయించాడు.