అక్షరటుడే, కామారెడ్డిగ్రామీణం: రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ ను బైకుతో ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి మండలం శాబ్దిపూర్ శివారులో చోటుచేసుకుంది. దేవునిపల్లి ఎస్సై రాజు వివరాల ప్రకారం.. రామారెడ్డి మండలం కన్నాపూర్ కు చెందిన వడ్ల నవీన్ కుమార్(25) గురువారం తెల్లవారుజామున బైక్ పై కామారెడ్డి వైపు బయలుదేరాడు. శాబ్దిపూర్ శివారుకు చేరుకోగానే సర్వీస్ రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలవగా అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.