అక్షరటుడే, వెబ్ డెస్క్: డిచ్ పల్లి మండలంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఘన్పూర్ గ్రామ చౌరస్తా కమాన్ వద్ద ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా.. మృతుడు నడిపల్లి తండాకు చెందిన కృష్ణ(28)గా గుర్తించారు. మృతుడు కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. పక్కనే ఉన్న కల్లుబట్టి వద్ద గొడవ జరిగి ఉండవచ్చని, ఈ క్రమంలోనే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డిచ్ పల్లి సీఐ మల్లేశ్, ఎస్సై షరీఫ్ వివరాలు సేకరిస్తున్నారు.