అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఓ యువతి పెళ్లి మండపం నుంచి నేరుగా పరీక్ష కేంద్రానికి వెళ్లింది. వివాహ దుస్తుల్లోనే గ్రూప్​–2 పరీక్షకు హాజరైంది. చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో నమిత అనే యువతి వివాహం ఆదివారం ఉదయం జరిగింది. గ్రూప్​ –2 పరీక్ష నేపథ్యంలో పెళ్లి తంతు కాగానే అవే బట్టల్లో తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ సెంటర్​కు యువతి వెళ్లింది.