అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రజాసేవలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విఫలమయ్యారని ఆ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి కైలాస్ గహ్లోత్ విమర్శించారు. ఈ మేరకు ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్న కైలాస్ తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పంపించారు. పార్టీ తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. కాగా.. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి అతీషి ఆమోదించారు.