అక్షరటుడే, ఇందూరు: వివేకానందుని స్ఫూర్తితో ఏబీవీపీ పనిచేస్తుందని ఇందూరు విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేశ్ అన్నారు. ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో సిద్దిపేటలో మహాసభలు జరగనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ సంఘటన మంత్రి రాజశేఖర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు శివకుమార్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, కామారెడ్డి జిల్లా ప్రముఖ్ గిరి తదితరులు పాల్గొన్నారు.