అక్షరటుడే, ఇందూరు: బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ధర్నా చేసిన ఏబీవీపీ నాయకులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. దాడిలో గాయపడిన ఏబీవీపీ నాయకుడు సాయిప్రసాద్ ను బుధవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ వెంట అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఏబీవీపీ రాష్ట్ర పూర్వాధ్యక్షుడు రేంజర్ల నరేశ్ తదితరులున్నారు.