అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఏబీవీపీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం వారు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశిధర్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా నగరంలోని శ్రీనగర్ కాలనీలో శ్రీ చైతన్య పాఠశాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై డీఈవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు విచారణ జరిపి సదరు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గాదాస్, సన్నీగౌడ్, మహేష్, శశాంక్, గణేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.