అక్షరటుడే, బోధన్: పట్టణంలోని ఆచన్‌పల్లిలో గల ఇందూర్ మోడల్ స్కూల్ ఎదుట మంగళవారం ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ.. పాఠశాల నుంచి 8వ తరగతి విద్యార్థి అదృశ్యమై నాలుగు రోజులు గడుస్తున్నా యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడం దారుణమన్నారు. విద్యార్థి తప్పిపోతే పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు విద్యార్థి ఆచూకీ వెంటనే కనిపెట్టాలని కోరారు.