అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల అకాడమిక్ కౌన్సిల్ మెంబర్ గా ఎంపికైన రిటైర్డ్ ప్రొఫెసర్ తుకారాంను శనివారం బీసీ సంక్షేమ సంఘం సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపికకు కృషి చేసిన వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనం గంగాధర్, సాయిరాం, శ్రీనివాస్ గౌడ్, జీవన్, హాజీ, శ్రీనివాస్, నారాయణ పాల్గొన్నారు.