అక్షరటుడే, ఇందూరు: అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల్లో భాగంగా శనివారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు జిల్లా కోర్టు భవనంలోని హాల్‌లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి బహుమతులు అందజేస్తారని తెలిపారు.