అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అఖండ-2 మూవీ తర్వాత వచ్చే తన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘డాకు మహారాజ్‌’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇలాంటి సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. ఈ మూవీ కుటుంబంతో కలిసి చూడదగినదన్నారు. అలాగే తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందిస్తూ.. ఈ విషయం ఎంతో బాధ కలిగించిందన్నారు. కాగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ భరత్‌ దంపతులు హాజరయ్యారు.