అక్షరటుడే, వెబ్​డెస్క్​: నటుడు మంచు మోహన్​బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్​పై దాడి కేసులో ఆయనకు ధర్మాసనం ముందస్తు బెయిల్​ మంజూరు చేసింది. డిసెంబర్​ 10న ఓ జర్నలిస్ట్​పై మోహన్​బాబు మైక్​తో దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తు బెయిల్​ కోసం ఆయన సుప్రీంను ఆశ్రయించగా గురువారం విచారించిన ధర్మాసనం బెయిల్​ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.