అక్షరటుడే, హైదరాబాద్: తనకు ఇంకా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఓ టీవీ ఛానల్ తో నటి లావణ్య వాపోయారు. హార్డ్‌డిస్క్ కోసం మస్తాన్‌సాయి, అతని పేరెంట్స్ తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తనకు ప్రాణహాని ఉందన్నారు. ఇన్ని రోజులు తన దగ్గర ఎవిడెన్స్ లేకపోవడంతో ఆగినట్లు చెప్పారు. కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని లావణ్య ఆరోపించారు.
ఆ వీడియోలో ఉన్నది నా భార్య : మస్తాన్ సాయి
కాగా, ఆ వీడియోలో ఉన్నది తన భార్య అని మస్తాన్ సాయి పేర్కొన్నారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 2017లో హనీమూన్ కు వెళ్లినప్పుడు తీసుకున్న వీడియోలు అవి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్‌లో లావణ్యకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయని తెలిపారు. వాటిని మాయం చేసేందుకు లావణ్య హార్డ్ డిస్క్ ను దొంగిలించినాట్లు మస్తాన్ సాయి ఆరోపించారు.