అక్షరటుడే, వెబ్డెస్క్: సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు నటి రష్మిక మందన్న ముందుకొచ్చారు. ఇండియన్ సైబర్ క్రైం కో-ఆర్డినేషన్ సెంటర్(ఐసీసీసీసీ)కు బ్రాండ్ అంబాసిడర్గా ఆమె నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు సంబంధించిన సైబర్ దోస్త్ విభాగం ప్రకటించింది. సైబర్ క్రైం గురించి ఆమె అధికారికంగా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటారు. డీఫ్ ఫేక్ వీడియోల కారణంగా పడుతున్న ఇబ్బందులను ఆమె వివరించనున్నారు.