అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎం కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ అంకిత్‌కు ఆదేశాలు వచ్చాయి. అక్రమంగా ఇంటి నంబర్ల కేటాయింపు, కాలం చెల్లిన ఆటోల కొనుగోలు, ఇతర అవినీతి, అక్రమాలపై బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవీ నరసింహరెడ్డి సీఎంవోకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టాలని ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు విచారణ జరిపి నివేదిక అందించాలని మున్సిపల్ కమిషనర్ ను అదనపు కలెక్టర్ ఆదేశించారు.