అక్షరటుడే, వెబ్‌డెస్క్ : భైంసా విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు ఏడీఈ ఆదిత్య తెలిపారు. పట్టణంలోని 133కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల నేపథ్యంలో భైంసా, తానూర్, లోకేశ్వరం, కుభీర్, కుంటాల మండలంలోని కల్లూరు ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్న 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.