అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూరు మండల కేంద్రంలో చిప్ప రాములు అనే అనాథ అనారోగ్యంతో మృతి చెందడంతో గురువారం సాయంత్రం గ్రామ పంచాయతీ కార్మికులు దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. రాములుకు ఎవరూ లేకపోవడంతో హోటళ్లలో, రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అనారోగ్యంతో మరణించడంతో గ్రామ పంచాయతీ కార్మికులు దహన సంస్కారాలను నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్మికులను స్థానికులు అభినందించారు.