అక్షరటుడే, బాన్సవాడ: రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని 13వ వార్డులో గురువారం నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడారు. ఖాళీ స్థలాలను ఉన్న వారు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జాబితాలో పేర్లు లేని వారందరి దరఖాస్తులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు కృష్ణారెడ్డి, ఖలేక్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.