అక్షరటుడే, బాన్సువాడ : రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ లో తన కార్యాలయంలో వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్ పూర్తయితే 14 వేల ఎకరాలకు రెండు పంటలకు సాగు నీరు అందుతుందని అన్నారు. రూ. 200 కోట్లతో ఒక టీఎంసీ కెపాసిటీతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.