అక్షరటుడే, బాన్సువాడ: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం తన నివాసంలో పంపిణీ చేశారు. బాన్సువాడ, నస్రుల్లాబాద్, మోస్రా మండలాలకు చెందిన 181 మంది లబ్ధిదారులకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బీర్కూరు మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ శ్యామల శ్రీనివాస్, వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.