అక్షరటుడే, బాన్సువాడ: విద్యార్థినులు కలలు కనాలని.. వాటిని సాకారం చేసుకునేందుకు పట్టుదలతో చదవాలని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బాన్సువాడ మండలంలోని బోర్లం మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం కామన్ డైట్‌ప్లాన్‌ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్‌రాజ్, ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, ఎజాజ్, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.