అక్షరటుడే, బాన్సువాడ: మత్స్య కార్మికులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. మండలంలోని తాడ్కోల్ ఊర చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగపుత్రులు ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బుడిమి సొసైటీ ఛైర్మన్ గంగారం, నాయకులు గోపాల్ రెడ్డి, ఖాలేక్, మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.