అక్షరటుడే, బాన్సువాడ: మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో దెగ్లూర్ నియోజకవర్గం కొండల్వాడి గ్రామంలో ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థి నివర్తి రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.