అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎస్సై ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. రూరల్ ఠాణాలో తుపాకీతో కాల్చుకున్నారు. తణుకు రూరల్ SIగా పనిచేస్తున్న మూర్తి ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. శుక్రవారం ఉదయం స్టేషన్ కు వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకున్నారు. మనస్తాపంతోనే మూర్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.